మంత్రి గుమ్మనూరుకు చేదు అనుభవం

మంత్రి గుమ్మనూరుకు చేదు అనుభవం

మంత్రి గుమ్మనూరు జయరాంకు చేదు అనుభవం ఎదురైంది. గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా.. ఆయన హోళగుంద మండలం ఇంగళదాళ్‌ కు వెళ్లారు. అయితే.. ఎక్కడికక్కడ ఆయన్ను నిలదీశారు మహిళలు. నాలుగేళ్లుగా గ్రామానికి ఏం చేశావంటూ ప్రశ్నించారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు లేవంటూ మండిపడ్డారు మహిళలు. మంత్రి అయ్యాక తమ గ్రామానికే రాలేదని, ఇప్పుడొచ్చి ఏం చేస్తారని ప్రశ్నించారు. అయితే ఎప్పటిలాగానే మంత్రి నిధులు కేటాయించాం, పనులు ప్రారంభిస్తాంటూ అక్కడనుంచి జారుకున్నారు.

Next Story