కేసీఆర్ ప్రభుత్వంతో రైతులకు భరోసా దొరికింది

కేసీఆర్ ప్రభుత్వంతో రైతులకు భరోసా దొరికింది

సీఎం కేసీఆర్ ప్రభుత్వంతో రైతులకు భరోసా దొరికిందని మంత్రి హరీష్ రావు అన్నారు. బావుల వద్ద మీటర్లు పెడతామని బీజేపీ, వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలని కాంగ్రెస్ చెబుతుంటే... నీళ్లకు, కరెంట్‌కు డోకా లేదని, మూడు పంటలు పండించాలని సీఎం కేసీఆర్ రైతులకు చెబుతున్నారని మంత్రి అన్నారు. సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేశారు. సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి, లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చారని తెలిపారు.

Next Story