సిద్ధంగా ఇందిరా పార్క్ ఫ్లైఓవర్

సిద్ధంగా ఇందిరా పార్క్ ఫ్లైఓవర్

హైదరాబాద్‌లో మరో ప్లైఓవర్‌ ప్రారంభానికి సిద్ధమైంది.ఇందిరాపార్క్‌ నుంచి ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, వీఎస్టీ మీదుగా అజామాబాద్‌ వరకు చేపట్టిన బ్రిడ్జి పనులు తుది దశకు చేరుకున్నాయి. 2.8 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి.జీహెచ్ఎంసీ పరిధిలోని ఈ అత్యంత పెద్ద కట్టడానికి దాదాపు రూ. 450 కోట్లు కేటాయించారు. స్ట్రాటజికల్ రోడ్స్ డెవలప్మెంట్ లో భాగంగా ఎస్ఆర్టీపీ వంతెన రూపొందించారు. ఈ వంతెన 26.54 మీటర్ల ఎత్తు లో నిర్మించారు. ఈనెల ఆఖరులో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించే అవకాశం ఉంది.

Next Story