పథకాలు అందని వారు అసంతృప్తి చెందొద్దు: మంత్రి మహేందర్‌రెడ్డి

పథకాలు అందని వారు అసంతృప్తి చెందొద్దు: మంత్రి మహేందర్‌రెడ్డి

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారు అసంతృప్తి చెందొద్దన్నారు మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి. ప్రతి పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని చెప్పారు. అందరికీ అర్హతలను బట్టి సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. చేవెళ్లలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌తో కలిసి బీసీ బంధు లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. తొలి విడతగా రంగారెడ్డి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 300 చొప్పున.. 2100 మంది లబ్ధిదారులకు 21 కోట్లు అందజేశామన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు.

Next Story