తిరుపతిలో మిషన్‌ ఈ-వేస్ట్‌ కలెక్షన్‌ సెంటర్‌ ప్రారంభం

తిరుపతిలో మిషన్‌ ఈ-వేస్ట్‌ కలెక్షన్‌ సెంటర్‌ ప్రారంభం

తిరుపతిలోని సెలెక్ట్‌ మొబైల్స్‌ ఆధ్వర్యంలో మిషన్‌ ఈ-వేస్ట్‌ కలెక్షన్‌ సెంటర్‌ను TTD ఈవో ధర్మారెడ్డి ప్రారంభించారు. ఎలక్ట్రానిక్‌ వ్యర్ధాలతో పర్యావరణం కాలుష్యం అవుతుందని ఆయన తెలిపారు. వ్యర్ధాలను సేకరించి మానవాళికి నష్టం లేకుండా యాజమాన్యం చేపట్టిన చర్యలను ఆయన అభినందించారు. ఏపీలో మొదటిసారి మొబైల్‌ వ్యర్ధాలను సేకరిస్తున్నామని సెలెక్ట్‌ మొబైల్స్‌ ప్రతినిధి గురు తెలిపారు. ఎలక్ట్రానిక్‌ వ్యర్ధాలను తమకు అందిస్తే కొత్తగా కొనుగోలు చేసే వస్తువులకు డిస్కౌంట్‌ ఇస్తామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలక్ట్రానిక్‌ వ్యర్ధాలను తమ షాపుల్లో డిపాజిట్‌ చేయాలని కోరారు.

Next Story