Raghunandan Rao: కేసీఆర్‌ ప్రభుత్వంపై మండిపడ్డ రఘునందన్‌ రావు

Raghunandan Rao: కేసీఆర్‌ ప్రభుత్వంపై మండిపడ్డ రఘునందన్‌ రావు

కేసీఆర్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌ రావు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను చూడటానికి వెళ్తుంటే..బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉలికిపాటెందుకని ప్రశ్నించారు. కేంద్ర నిధుల వాటాను కూడా దుర్వినియోగం చేశారని ఆరోపించారు. భారత పౌరుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్‌ రెడ్డి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పరిశీలించే అధికారం ఉందని అన్నారు. తాము ముందే పోలీసులకు సమాచారం అందించామని.. కానీ పోలీసులే అనసరంగా అడ్డుకున్నారని అన్నారు. డబుల్ బెడ్ ఇళ్లు గొప్పగా నిర్మిస్తే ఈ అక్రమ అరెస్టులు ఎందుకని అన్నారు. ఇదేమైనా ఉద్యమమా.. లేక తిరుగుబాటా అని ప్రశ్నించిన ఆయన హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు..బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట అని అన్నారు.

Next Story