Vande Bharat: వందే భారత్ ఢీకొని ముగ్గురు మృతి

Vande Bharat: వందే భారత్ ఢీకొని ముగ్గురు మృతి

భారత్‌లో రైలు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉండగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్‌లో వందే భారత్ రైలు ఢీకొని ముగ్గురు అక్కడిక్కడే మరణించారు. వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం కసంపూర్ దగ్గర వందే భారత్ రైలు రానుండడంతో క్రాసింగ్ గేట్లను మూసివేశారు. అయినా కూడా రైలు పట్టాలు దాటేందుకు ప్రయత్నించారు 40 ఏళ్ళ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెలు. కానీ వారు పట్టాలు దాటుతుండగా అత్యంత వేగంగా వచ్చిన వందే భారత్ ట్రైన్ వారిని ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ అక్కడిక్కడే మరణించారు. ఈ ఘటనలో మృతి చెందినవారు మీరట్ కు చెందిన మోనా, మనీషా, చారులుగా గుర్తించారు. మోనాకు 40 ఏళ్ళు కాగా, మనీషాకు 14, చారుకు 7 ఏళ్ళు.

Next Story