విశాఖపట్నం మర్రిపాలెం ఉడా లే అవుట్‌లో విషాదం

విశాఖపట్నం మర్రిపాలెం ఉడా లే అవుట్‌లో విషాదం

విశాఖపట్నం మర్రిపాలెం ఉడా లే అవుట్‌లోని అపార్టుమెంట్ నీటి సంపులో ఇద్దరు పిల్లలతో సహా తల్లి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతులు తల్లి సంధ్య, పిల్లలు ఆలేఖ్య, గౌతమ్ లుగా గుర్తించారు. కంచరపాలెం సీఐ సాయి ఆధ్వర్యంలో సంపులోని నీరు తోడి ముగ్గుర్ని బయటకు తీశారు. అప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కేజీహెచ్ తరలించారు. మృతురాలు సంధ్య భర్త లక్ష్మణ్‌ 9 నెలలుగా అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు.

Next Story