టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు తన నివాసంలో ఉపవాస దీక్షకు దిగారు. దసరా వేడుకలకు దూరంగా ఉన్న ఆయన ఉపవాస దీక్ష చేశారు. చంద్రబాబును అక్రమంగా నిర్బంధించి జైల్లో పెట్టారని, జైల్లో కిరాతకులుండాలి కాని ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసినవాళ్లు కాదని మోత్కుపల్లి అన్నారు. చంద్రబాబు అరెస్టుతో తెలుగు ప్రజలు అల్లాడిపోతున్నారని, ఆయనను మానసిక క్షోభకు గురిచేస్తుంటే తల్లడిల్లిపోతున్నారని అన్నారు. జగన్ జైల్లో ఉండి వస్తే అందరూ జైలుకు పోవాలా అని నిలదీశారు. చంద్రబాబుకు బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారని, జగన్ రాజ్యంలో ఎవరైనా సుఖంగా ఉన్నారా అని మోత్కుపల్లి ప్రశ్నించారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మిగిలిపోయిందన్నారు. జగన్.. ఇక మీ ఆటలు సాగవని... మీ కుట్రలను ప్రజలు సాగనివ్వరని స్పష్టం చేశారు. కడుపుమండి మాట్లాడుతున్నానని, ప్రజలు జగన్ ఆటకట్టిస్తారని మోత్కుపల్లి మండిపడ్డారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com