తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం: ఎంపీ కోమటిరెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారం: ఎంపీ కోమటిరెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్‌దే అధికారమన్నారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తమ ప్రభుత్వం రాగానే రెండు లక్షల రుణమాఫీపై తొలి సంతకం పెడతామన్నారు. నల్గొండ జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతలు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప... 9 ఏళ్లలో జిల్లాకు ఏమీ చేయలేదన్నారు. నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంలలో పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో కోమటిరెడ్డి పాల్గొన్నారు. వెలుగుపల్లికి చెందిన పలువురు కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు.

Next Story