RRR: విశాఖ ఎంపీపై రఘురామకృష్ణంరాజు ఆరోపణలు

RRR: విశాఖ ఎంపీపై రఘురామకృష్ణంరాజు ఆరోపణలు

పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ.. తనను దూషించినట్టు ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. తనపై అసభ్య పదజాలంతో దండెత్తారని ఆరోపణలు కురిపించారు. తనను చంపేస్తానంటూ ఇతర ఎంపీల ఎదుటే సత్యనారాయణ బెదిరించారని రఘురామకృష్ణరాజు చెప్పారు. మాటల్లో చెప్పడానికి వీల్లేని భాషలో దూషణలకు దిగారన్నారు. ఈ పరిస్థితిని గమనించి సత్యనారాయణను.. వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి బయటకు తీసుకెళ్లారని తెలిపారు.

విశాఖలో ఎంవీవీ సత్యనారాయణ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ వ్యవహారంపై స్పీకర్‌, హోం మంత్రిత్వశాఖకు గతంలో లేఖ రాశానని రఘురామకృష్ణరాజు చెప్పారు. ఎవరినడిగి లేఖ రాశావంటూ సత్యనారాయణ తనపై ఆగ్రహం వ్యక్తం చేశారని ఆరోపించారు. ఎంవీవీ తీరుపై స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణంరాజు. గతంలోనూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌.. తనను చంపేస్తానని బెదిరించినట్టు లోక్‌సభ స్పీకర్‌కు రఘురామ ఫిర్యాదు చేశారు.


Next Story