
By - jyotsna |11 April 2026 8:30 AM IST
ముంబైలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. మీరా భయందర్ ప్రాంతంలోని మురికివాడల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మీరా భయందర్‌లోని ఇంద్రలోక్ ఫేజ్ 4లో ఈ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని భావిస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు, 40 ఏళ్ల వ్యక్తి మరణించారు. అయితే మంటలు భారీ ఎత్తున ఎగిసిపడ్డాయి. గ్యాస్ సిలిండర్లు పేలిపోవడంతోనే ఈ మంటలు ఎగిసిపడినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

