
By - Chitralekha |22 July 2023 12:27 PM IST
హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాలకు మూసీనది పొంగి ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వచ్చే వాగులు, వంకలు సైతం కలుస్తుండటంతో దిగువనున్న ప్రాజెక్ట్ కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 642 అడుగులను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 4.46 TMC లకుగాను.. ఇపుడు 3.70 TMC లుగా కొనసాగుతుంది. కుడి, ఎడమ కాలువలతోపాటు మూసీ డ్యామ్ ఆరు క్రస్ట్ గేట్లను.. రెండు ఫీట్ల మేర పైకెత్తి దిగువకు నీరు వదులుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com