BHUVANESHWARI: భువనమ్మ "మేలుకో తెలుగోడా" యాత్రకు ఏర్పాట్లు!

BHUVANESHWARI: భువనమ్మ మేలుకో తెలుగోడా యాత్రకు ఏర్పాట్లు!

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఆయన సతీమణి భువనేశ్వరి బస్సు యాత్ర చేస్తారన్న వార్తల నేపథ్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం భువనమ్మ యాత్ర రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు. పర్యటనకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను పరిశీలించి, అధిష్ఠానానికి పంపారు. కుప్పం ఆర్టీసీ బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బహిరంగసభ నిర్వహిస్తారని తెలుస్తోంది. బస్సు యాత్ర ఏ తేదీ నుంచి ప్రారంభమవుతుందో స్పష్టత లేకపోయినా కుప్పం నుంచి ఈ యాత్ర ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మేలుకో తెలుగోడా పేరుతో భువనమ్మ యాత్ర చేపడతారని తెలుస్తోంది.


Next Story