జగన్‌ ప్రతిపక్ష నేతగా కాకుండా ఫ్యాక్షనిస్టులా మాట్లాడారు

జగన్‌ ప్రతిపక్ష నేతగా కాకుండా ఫ్యాక్షనిస్టులా మాట్లాడారు

వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌. యువగళం సభలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని తమపై కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని అవమానించిన వారికి బుద్ధి చెబుతానని అనడం.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే బాధ్యత ప్రతిపక్షాలు నిర్వర్తించడం నేరం ఎలా అవుతుందన్నారు. ప్రతిపక్ష నేతగా కాకుండా ఫ్యాక్షనిస్టులా చంద్రబాబుని కాల్చి చంపండి.. ఉరి వేయండి, చెప్పలతో కొట్టండంటూ.. జగన్ విద్వేష ప్రసంగాలు చేశారని లోకేష్‌ గుర్తు చేశారు.

Next Story