Haryana : హర్యానా సీఎంగా నేడు సైనీ ప్రమాణం

Haryana : హర్యానా సీఎంగా నేడు సైనీ ప్రమాణం

హర్యానా బీజేపీ శాసనసభా పక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం ఆయన హర్యానా సీఎంగా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఆయన గవర్నర్‌ బండారు దత్తాత్రేయను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వాలని కోరారు. బీజేపీ విజయం సాధిస్తే సైనీయే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఎన్నికల అనంతరం బీజేపీ ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకు ముందు సీఎంగా ఉన్న మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ను తొలగించిన బీజేపీ మార్చిలో సైనీని ముఖ్యమంత్రిగా చేసింది. ఆయన నాయకత్వంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లకు 48 స్థానాల్లో బీజేపీ విజయం సాధించగా, విపక్ష కాంగ్రెస్‌ 37 సీట్లకే పరిమితమైంది.

Next Story