Building Collapses: ఢిల్లీలో కూలిన భవనం, ఎంతమందిని రక్షించారంటే?

Building Collapses: ఢిల్లీలో కూలిన భవనం, ఎంతమందిని రక్షించారంటే?

ఢిల్లీలో కొత్తగా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం కూలింది. బురారీ ప్రాంతంలోని ఆస్కార్‌ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలో కౌశీక్‌ ఎన్‌క్లేవ్‌ అనే భవనం సోమవారం రాత్రి 7 గంటలకు కుప్పకూలింది. పోలీసులు, అగ్నిమాపక, ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందా లు చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి.

శిథిలాల కింద చిక్కుకున్న 10 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించాయి. రక్షించిన వారిలో ఆరు, 14 ఏండ్ల అమ్మాయిలిద్దరు ఉన్నారని ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ చీఫ్‌ అతుల్‌ గార్గ్‌ తెలిపారు. మరో 10 మంది వరకు శిథిలాల కింద ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని తమ ఎమ్మెల్యే సంజీవ్‌ ఝా, పార్టీ కార్యకర్తలను ఆదేశించినట్టు తెలిపారు.

Next Story