America : ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే వీసా రద్దు

America : ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే వీసా రద్దు

అమెరికాలో విద్యనభ్యసించేందుకు వెళ్లిన విదేశీ విద్యార్థులు ట్రంప్‌ విధానాలతో గజగజ వణుకుతున్నారు. ఎప్పుడు ఏ కారణంతో వీసా రద్దు చేసి ఇంటికి పంపుతారో తెలియక దినదిన గండంగా గడుపుతున్నారు. గతంలో ఎప్పుడైనా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినా ఇప్పుడు దానికి వీసా రద్దు చేయడం ద్వారా శిక్ష విధిస్తున్నారని అసోసియేటెడ్‌ ప్రెస్‌ (ఏపీ) వార్తా సంస్థ మంగళవారం వెల్లడించింది.

ఇటీవలి కాలంలో అంతర్జాతీయ విద్యార్థుల వీసాల రద్దు పెరిగినట్టు పలు అమెరికన్‌ కాలేజీలు వెల్లడించాయి. వీసా రద్దయిన విద్యార్థుల్లో భారతీయులు కూడా ఉన్నట్టు పేర్కొన్నాయి. పాలస్తీనా అనుకూల ప్రదర్శనలతో సంబంధం లేని వారి వీసాలు కూడా రద్దవుతున్నట్టు తెలిపాయి. హార్వర్డ్‌, స్టాన్‌ఫర్డ్‌, యూసీఎల్‌ఏ, ఒహాయో స్టేట్‌ సహా పలు ప్రముఖ యూనివర్సిటీల అధికారులు తాము ఫెడరల్‌ ఇమిగ్రేషన్‌ డాటాబేస్‌ను చూసిన తరువాత ఈ విషయం తెలిసిందని అన్నారు.

Next Story