
By - Vijayanand |8 Aug 2023 3:58 PM IST
లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ నేత గౌరవ్ గగోయ్ ఆ చర్చను ప్రారంభించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాము ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసి వచ్చిందన్నారు. ఇది సంఖ్యా బలానికి సంబంధించినది కాదని, కేవలం మణిపూర్ రాష్ట్రానికి న్యాయం జరగడం కోసమేనని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రకటించాలని కోరుతూ తాను ఈ తీర్మానాన్ని ప్రతిపాదించానని తెలిపారు. ఇండియా కూటమి ఈ తీర్మానాన్ని మణిపూర్ రాష్ట్రం కోసం తీసుకొచ్చిందని, మణిపూర్ న్యాయం కోరుతోందని తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com