
ప్రముఖ అణు శాస్త్రవేత్త డాక్టర్ రాజగోపాల చిదంబరం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబై జస్‌లోక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజగోపాల చిదంబరం మృతి పట్ల శాస్త్రవేత్తలతో పాటు రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు.
అణు శాస్త్రవేత్తగా తన కెరీర్‌ను చిదంబరం ప్రారంభించారు. పొఖ్రాన్-1(1975), పొఖ్రాన్-2(1998) అణు పరీక్షల్లో రాజగోపాల చిదంబరం కీలకపాత్ర పోషించారు. అణుశక్తి కమిషన్‌కు చైర్మన్‌గా సేవలందించారు. రాజగోపాలకు 1999లో పద్మవిభూషణ్, 1975లో పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారుగా పని చేశారు. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్(BARC) డైరెక్టర్‌గా పని చేశారు. అటామిక్ ఎనర్జీ కమిషన్(AEC) చైర్మన్‌గా సేవలందించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ(DAE) సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. 1994-95 మధ్య కాలంలో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ(IAEA) గవర్నర్ల బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com