Japan private Rocket: లాంచ్ అయిన వెంటనే పేలిపోయిన జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్.

Japan private Rocket: లాంచ్ అయిన వెంటనే పేలిపోయిన జపాన్ తొలి ప్రైవేట్ రాకెట్.

వాణిజ్య పరంగా అంతరిక్షంలో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్న జపాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఉదయం నింగిలోకి బయల్దేరిన తొలి ప్రైవేట్ రాకెట్ కైరోజ్…లాంచ్ అయిన సెకన్ల వ్యవధిలోనే పేలిపోయింది. టోక్యోకు చెందిన స్పేస్‌ వన్‌ సంస్థ నిర్మించిన కైరోస్‌ రాకెట్‌చిన్న ప్రభుత్వ ప్రయోగ ఉపగ్రహాన్ని తీసుకొని నింగిలోకి ఎగిరింది. అయితే, గాల్లోకి ఎగిరిన క్షణాల్లోనే 60 అడుగుల పొడవైన ఆ రాకెట్‌ ఒక్కసారిగా పేలిపోయింది. భారీగా పొగ, మంటలు వ్యాపించాయి. ఈ ఘటన పశ్చిమ జపాన్‌లోని వకయమ ప్రిఫిక్షర్‌లోని లాంచ్‌ ప్యాడ్‌లో చోటు చేసుకుంది. ఈ పేలుడుతో లాంచ్‌ ప్యాడ్‌ ప్రాంతమంతా నల్లటి పొగ కమ్మేసింది. ఈ ప్రయోగం విజయవంతమై ఉంటే ఆ దేశంలో శాటిలైట్‌ కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తొలి ప్రైవేట్‌ సంస్థగా స్పేస్‌ వన్ అవతరించేది.

Next Story