విశాఖ రుషికొండకు పవన్ కల్యాణ్

విశాఖ రుషికొండకు పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ జిల్లాలో తలపెట్టిన వారాహి యాత్రకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. కాసేపట్లో పవన్ కల్యాణ్ రుషికొండకు వెళ్లనున్నారు. అయితే పవన్ రిషికొండ పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే పోలీసుల అనుమతి లేకపోయినా యాత్ర కొనసాగిస్తామని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా ఆంక్షల నడుమే పవన్ పర్యటన కొనసాగుతుంది. ఇక ఈ పరిణామాలతో పవన్ కల్యాణ్ పర్యటనలో హైటెన్షన్ నెలకొంది.

పవన్ కల్యాణ్ రుషికొండ పర్యటనను అడ్డుకోవాలని ప్రభుత్వం చూస్తోందంటూ ఫైర్ అయ్యారు జనసేన అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ. పవన్ టూర్‌కు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రుషికొండను తవ్వేసి పర్యావరణ నిబంధనల్ని తుంగలో తొక్కారంటు ఫైర్ అయ్యారు. రుషికొండలో పవన్‌ పర్యటిస్తే మీకొచ్చే ఇబ్బంది ఏంటి?అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story