Peak Bengaluru Moment: ట్రాఫిక్ లో కూరగాయలు తరిగిన మహిళ

Peak Bengaluru Moment: ట్రాఫిక్ లో కూరగాయలు తరిగిన మహిళ

బెంగుళూరు.. ట్రాఫిక్ జామ్‌లకు ప్రసిద్ధి చెందిన నగరం. అతి తక్కువ దూరం వెళ్లాలన్నా నగర వాసులు అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. లొకేషన్ టెక్నాలజీలో ప్రత్యేకత కలిగిన డచ్ బహుళజాతి సంస్థ టామ్‌టామ్ నుండి వచ్చిన నివేదిక ప్రకారం, డ్రైవింగ్‌లో బెంగళూరు ప్రపంచంలోనే రెండవ అతి తక్కువ నగరంగా నిలిచింది. నగరంలో కేవలం 10 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేసేందుకు 29 నిమిషాల 10 సెకన్ల సమయం పడుతుంది. గత సంవత్సరం, బెంగళూరు సిటీ సెంటర్‌లో అదే దూరం ప్రయాణించే సమయం 29 నిమిషాల 9 సెకన్ల కన్నా కొంచెం తక్కువ. ఈ రద్దీ మధ్య, బెంగళూరు వాసులు ట్రాఫిక్‌లో తమ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వివిధ కథనాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఓ మహిళా ప్రయాణీకురాలి కథ ఇప్పుడు ట్రెండింగ్ లో నిలుస్తోంది.

Xలో షేర్ చేసిన ఈ పోస్ట్‌లో, ప్రియా అనే ఓ యూజర్ కారు సీటుపై ఉంచిన ఒలిచిన బఠానీలు, పచ్చి బఠానీల ప్యాకెట్ల ఫొటోను అప్‌లోడ్ చేశారు. ట్రాఫిక్ సమయాన్ని ఇలా వినియోగించుకున్నానని అని ఆమె పోస్ట్‌లో రాసింది. ఈ పోస్ట్ ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో ఇప్పటివరకు దీనికి దాదాపు 1లక్షా 6 వేల వ్యూస్ వచ్చాయి. దీనికి అనేక కామెంట్స్ కూడా వచ్చాయి. “దీన్ని నా బాస్ కు పంపుతున్నాను” అని ఓ యూజర్ హాస్యాస్పదంగా రాసుకువచ్చారు.

Next Story