దేశ వ్యాప్తంగా గణేశ్ ( నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా గణేశ్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తమ ఇళ్లలో ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలోనూ గణపతి పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇక ఈ పూజలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
తమ నివాసానికి వచ్చిన ప్రధానికి సీజేఐ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ సంప్రదాయాన్ని అనుసరించారు. మహారాష్ట్ర సంప్రదాయ టోపీ, కుర్తాపైజామా ధరించి పూజలో పాల్గొన్నారు. ఈ పూజకు సంబంధించిన ఫొటోను మోదీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు. విఘ్నేశ్వరుడు మనందరికీ ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని అనుగ్రహించాలని ప్రార్థించినట్లు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com