
By - jyotsna |15 Dec 2025 8:15 AM IST
ప్రధాని మోడీ మరోసారి విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. నేటి నుంచి ఈనెల 18 వరకు మూడు విదేశాల్లో పర్యటించనున్నారు. జోర్డాన్, ఇథియోపియా, ఒమన్ దేశాల్లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. లింక్ వెస్ట్ పాలసీ, ఆఫ్రికా ఇనిషియేటివ్‌లో భాగంగా పర్యటన కొనసాగుతోంది. ఈ మూడు దేశాలతో భారత్ వాణిజ్య ఒప్పందాలను బలోపేతం చేసుకోనుంది. ద్వైపాక్షిక సంబంధాలతో దేశాలతో భారత్ సంబంధాలు బలపడనున్నాయి.
గత నెల నవంబర్ 21, 22, 23 తేదీల్లో దక్షిణాఫ్రికాలో జరిగిన జీ20 సమ్మిట్‌కు ప్రధాని మోడీ హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సమ్మిట్‌కు ట్రంప్ గైర్హాజరయ్యారు. సౌతాఫ్రికాలో శ్వేత జాతి రైతులపై దాడులు నిరసిస్తూ ట్రంప్ నిరసన వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com


