పోచారం బ్యాక్‌ వాటర్‌లో పంట పొలాలు

పోచారం బ్యాక్‌ వాటర్‌లో పంట పొలాలు

మెదక్‌ జిల్లా హవేళి ఘనపూర్ మండలంలో పోచారం బ్యాక్‌ వాటర్‌లో పంట పొలాలు మునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని నాలుగు గ్రామాల పరిధిలో 300 ఎకరాలు ప్రాజెక్ట్ బ్యాక్‌ వాటర్‌లో మునిగిపోయాయి. మరికొన్ని చోట్ల పొలాలపై ఇసుక మేటలు వేశాయి.. రాజిపేట గ్రామంలోనే 100 ఎకరాలకు పైగానే సాగుకు వీలుకాకుండా పోయాయి. దీంతో చిన్న, సన్నకారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

Next Story