By - Sathwik |21 Aug 2024 8:45 AM GMT
టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు అంటించారు. టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి రోజు సీసీటీవీ ఫుటేజీని సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2021 అక్టోబర్ 19 నాటి సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొనడం జరిగింది. దాడి రోజు వైసీపీ ఆఫీస్ నుంచి ఎవరెవరు బయల్దేరారనే అంశంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అలాగే ఇదే కేసులో వైసీపీ నేత దేవినేని అవినాశ్‌కు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. గుణదలలోని ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. తాము చెప్పిన రోజు విచారణకు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com