
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబుకు త్వరగా బెయిల్ మంజూరు కావాలంటూ... గంటూరు జిల్లా తెలుగుదేశం నేతలు ప్రత్యేక పూజలు చేశారు. గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో... నాజ్ సెంటర్ లోని ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తెదేపా నేతలు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా తమ అధినేత చంద్రబాబు బయటకు వస్తారని తెదేపా నేతలు, కార్యకర్తలు ధీమా వ్యక్తం చేశారు. అటు చిత్తూరు జిల్లా కుప్పంలో... తెదేపా శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ ఆలయంలో పూజల తర్వాత పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం నిరసన దీక్షలో పాల్గొని చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com