
ప్రధాని నరేంద్ర మోడీ నేడు ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ , పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ ఇన్ స్టిట్యూట్ ను.. ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో పాటు సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నట్లు ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. మంగళవారం మధ్యాహ్నాం పాలసముద్రానికి చేరుకొనున్న ప్రధాని ప్రారంభోత్సవం అనంతరం... అకాడమీలోని కేంద్రాలను సందర్శించనున్నారు. తర్వాత ట్రైనీ అధికారులు, నిర్మాణ కార్మికులతో కాసేపు ముచ్చటించనున్నారు. అనంతరం..ఫ్లోరా ఆఫ్ పాలసముద్రం అనే పుస్తకాన్నిమోడీ విడుదల చేయనున్నారు. తర్వాత ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసగించనున్న మోడీ N.A.C.I.Nకు గుర్తింపు పత్రాన్ని అందజేయనున్నారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com