Srikakulam: ప్రైవేట్‌ స్కూల్ ఆటో బోల్తా..

Srikakulam: ప్రైవేట్‌ స్కూల్ ఆటో బోల్తా..

శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రైవేట్‌ స్కూల్ ఆటో బోల్తా పడింది. పలాస మండలం కిష్టుపురం గ్రామ సమీపంలో స్కూలు పిల్లలతో వెళ్తున్న టాటా మ్యాజిక్ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ఉన్న పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనం నుంచి పిల్లల్ని బయటికి తీశారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణం అంటున్నారు. టాటామ్యాజిట్ ఆటో బోల్తా పడ్డ విషయం తెలియడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఘటనా స్థలానికి పరగులు తీసారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది విద్యార్థులున్నారు.

Next Story