
By - Sathwik |27 Dec 2023 1:00 PM IST
రాచకొండ కమిషనరేట్ వార్షిక నేర నివేదికను సీపీ సుధీర్ బాబు బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 6.86 శాతం నేరాలు పెరిగాయని తెలిపారు. సైబర్ నేరాలు 25 శాతం పెరిగాయన్నారు. మహిళలపై 6.65 శాతం నేరాలు తగ్గాయని చెప్పారు. ఈ ఏడాది 2,562 సైబర్ కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాకు సంబంధించి 58 కేసుల్లో 163 మంది అరెస్టు అయినట్లు తెలిపారు. గేమింగ్ యాక్ట్‌పై 188 కేసులు నమోదు కాగా, 972 మంది అరెస్టు అయ్యారు. ఈ ఏడాది 5,241 కేసుల్లో శిక్షలు ఖరారు చేశామన్నారు. 20 కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడిందని సీపీ తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com