కమ్యూనిస్టు నేతలపై రఘునందన్‌రావు ఫైర్

కమ్యూనిస్టు నేతలపై రఘునందన్‌రావు ఫైర్


కమ్యూనిస్టు పార్టీ నేతలపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చౌదరపల్లిలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతుండగా కమ్యూనిస్టు పార్టీ నేతలు అడ్డుకున్నారు. దీంతో.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. కమ్యూనిస్టుల తీరును తప్పుపట్టిన రఘునందన్‌రావు.. సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలని వారిని హెచ్చరించారు.

Next Story