
దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండు హాల్స్ పేర్లు మార్చారు. వివిధ కార్యక్రమాలకు వేదికగా ఉంటున్న దర్బార్ హాల్, అశోక్ హాల్‌ను ఇక నుంచి గణతంత్ర మండపం, అశోక్ మండపంగా మార్చారు. ఈ మేరకు ప్రెసిడెంట్ సెక్రటేరియట్ వెల్లడించింది. జాతీయ అవార్డుల కార్యక్రమాల కోసం ప్రధాన వేడుకలను ఈ దర్బార్ హాల్‌లోనే నిర్వహించేవారు. ఆంగ్లేయులు, భారత పాలకులు సమావేశాలు నిర్వహించిన ప్రాంతాన్ని దర్బార్ అనేవారు. ఈ పేర్ల మార్పుపై విపక్షాలు విమర్శలు చేశాయి. కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ మాట్లాడుతూ.. దర్బార్ అనే కాన్సెప్ట్ లేదని.. కానీ షెహన్‌షా కాన్సెప్ట్ ఉండటం ఆసక్తికరంగా ఉందని వ్యంగ్యంగా స్పందించారు. అయితే పేర్ల మార్పును రాష్ట్రపతి భవన్ సమర్థించింది. రాష్ట్రపతి భవన్ వాతావరణాన్ని భారతీయ సాంస్కృతిక విలువలు, తత్వాలను ప్రతిబింబించేలా చేసే ప్రయత్నమే ఇదని వివరించింది. పేర్ల మార్పు సముచితమేనని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com