
గత 84 ఏండ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజుగా జూలై 22వ తేదీ రికార్డు సృష్టించింది. ఈ రోజున ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీలుగా నమోదైనట్టు యూరోపియన్ యూనియన్‌కు చెందిన కోపర్నికస్ ైక్లెమేట్ చేంజ్ సర్వీస్(సీ3ఎస్) తెలిపింది. జూలై 21వ తేదీన 17.09 డిగ్రీల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత నమోదు కావడం రికార్డు సృష్టించగా, మరునాడే దీనికి మించి నమోదైందని పేర్కొన్నది. తమ ప్రాథమిక డాటా ప్రకారం 1940 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రోజు జూలై 22 అని సీ3ఎస్ తెలిపింది. దీనికి ముందు గత ఏడాది జూలై 6న అత్యధికంగా 17.08 డిగ్రీల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడాది జూన్ నెల నుంచి వరుసగా 13 నెలలుగా ప్రతి నెలా ఉష్ణోగ్రతలు రికార్డులు సృష్టిస్తున్నాయని సీ3ఎస్ డైరెక్టర్ కార్లో బౌన్‌టెంపో తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com