బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య పొత్తు ఉందనడానికి ఇదే సాక్ష్యం: రేవంత్‌రెడ్డి

బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య పొత్తు ఉందనడానికి ఇదే సాక్ష్యం: రేవంత్‌రెడ్డి

గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ చర్చలపై రేవంత్‌రెడ్డి విమర్శలు చేశారు. ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య అగాధం ఉన్నట్లు నమ్మించిన కేసీఆర్‌..ఇప్పుడు రహస్య సమావేశంలో ఏం చర్చించారో చెప్పాలన్నారు. గవర్నర్‌ను బీజేపీ అధ్యక్షురాలు అంటూ విమర్శించిన కేసీఆర్ .. రాజ్‌భవన్‌కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య పొత్తు ఉందనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలన్నారు రేవంత్‌రెడ్డి. కలెక్టర్లను అడ్డుపెట్టుకుని కేసీఆర్‌ భూములు దోచుకుంటున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

Next Story