కేసీఆర్‌ను ప్రజలు రెండు చోట్ల ఓడిస్తారు: రేవంత్ రెడ్డి

కేసీఆర్‌ను ప్రజలు రెండు చోట్ల ఓడిస్తారు: రేవంత్ రెడ్డి

కేసీఆర్‌ను ప్రజలు రెండు చోట్ల ఓడిస్తారని అన్నారు టీ. పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి. గజ్వేల్‌, కామారెడ్డిలో పోటీ చేయడం ద్వారా కేసీఆర్‌ ఓటమిని ముందే ఒప్పుకున్నారని అన్నారు. తన సవాల్‌ స్వీకరించకుండా పారిపోయారని కామెంట్ చేశారు. ఇంత మందిని గెలిపించిన నాయకుడు.. రెండు చోట్ల పోటీ చేయడానికి కారణమేంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవబోతోంది.. ఇందిరమ్మ రాజ్యం రాబోతుందన్నారు. ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్‌ దిట్ట అన్న రేవంత్‌... 2014 ముందు ప్రతి ఎన్నికల్లో పొత్తుతోనే పోటీ చేయలేదా అని ప్రశ్నించారు.

Next Story