
దేశానికి ఆదర్శంగా కొండగల్ ని తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ అభ్యర్థి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కొండగల్ నుంచి భారాస అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై ఘన విజయం సాధించిన ఆయన కొడంగల్ గడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆత్మగౌరవజెండాను కొడంగల్ ఆకాశమంత ఎత్తున ఎగరేసిందని ట్విట్టర్ లో పేర్కొన్న ఆయన కొనఊపిరి వరకు కొడంగలే శ్వాసగా జీవిస్తానని పునరుద్ఘాటించారు. కష్టకాలంలో భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోశారు: రేవంత్ ..కష్టపడిన ప్రతిఒక్క కార్యకర్తను కడుపులో పెట్టుకుంటానని వివరించారు. ఈగడ్డపై ప్రతి బిడ్డ బతుకులో వెలుగు నింపే బాధ్యత తీసుకుంటానని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి 32,800 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై రేవంత్ రెడ్డి గెలుపొందారు. 2018 ఎన్నికల్లో పట్నం నరేందర్ రెడ్డి చేతిలో రేవంత్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com