
By - Vijayanand |19 Aug 2023 2:07 PM IST
ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌పై వెళుతున్న ముగ్గురు యువకులను ఇసుక లారీ ఢీకొట్టింది. ఘటనాస్థలంలోనే ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలో జరిగింది. మృతులు కొనకనమిట్ల మండలం అంబాపురం గ్రామానికి చెందిన వినోద్, నాని, వీరేంద్రగా గుర్తించారు. మార్కాపురం మండలం రాజుపాలెం గ్రామంలో ఓ శుభకార్యానికి హజరై తిరిగి వెళతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com