పరిహారం ఇచ్చే వరకు అండగా ఉంటా: పరిటాల శ్రీరామ్‌

పరిహారం ఇచ్చే వరకు అండగా ఉంటా: పరిటాల శ్రీరామ్‌

సత్యసాయి జిల్లా తాడిమర్రిలో రోడ్డు విస్తరణ వివాదాస్పదమైంది. పరిహారం ఇవ్వకుండా.. ఇళ్ల కూల్చివేతపై స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా.. లెక్కచేయకుండా రోడ్డుకిరువైపులా ఐదు అడుగుల వరకు కూల్చివేశారు. 60 అడుగుల మార్కింగ్ వేసిన ఇళ్లు పడగొట్టాలనీ, లేదంటే తామే కూల్చేస్తామని అధికారులు సూచించారు. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వారిని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పరిటాల శ్రీరామ్‌ పరామర్శించారు. ఆర్డీవోతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితులకు పరిహారం ఇచ్చే వరకు అండగా ఉంటానని శ్రీరామ్‌ అన్నారు.

Next Story