ఉప్పు రైతులకు లోకేష్ అభయం

ఉప్పు రైతులకు లోకేష్ అభయం

యువగళం పాదయాత్రలో ఉప్పు రైతుల సమస్యలు తెలుసుకున్నారు టీడీపీ యువనేత నారా లోకేష్‌. అల్లూరు మండలం ఇస్కుపల్లిలో ఉప్పుసాగు రైతులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. జగన్ ప్రభుత్వంలో ఉప్పు రైతులు కుదేలయ్యారని అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఉప్పు రైతులను ఆదుకుంటామని చెప్పారు. గుజరాత్‌, తమిళనాడు ఉప్పు రైతులతో పోటీ పడే విధంగా చర్యలు చేపడుతామన్నారు. ఉప్పు రైతుల ప్రాంతాల్లో తాగునీరు, రోడ్లు వేసే బాధ్యత తీసుకుంటామన్నారు. ఉప్పు రైతుకు రూపాయి 40 పైసలకే యూనిట్ కరెంటు, ట్రాక్టర్లు అందిస్తామని హామీ ఇచ్చారు.

Next Story