పల్నాడు జిల్లా వినుకొండలో 3 రోజుల పాటు 144 సెక్షన్‌

పల్నాడు జిల్లా వినుకొండలో 3 రోజుల పాటు 144 సెక్షన్‌

పల్నాడు జిల్లా వినుకొండలో 3 రోజుల పాటు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని పోలీసులు వెల్లడించారు. టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ నేపథ్యంలో 144 సెక్షన్‌ విధించారు. వినుకొండలో టీడీపీ ర్యాలీ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ శ్రేణులపై రాళ్లు, కర్రలతో వైసీపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. దీంతో ఉద్రిక్తతను కట్టడి చేసేందుకు 3 రోజుల పాటు 144 సెక్షన్‌ విధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story