
By - Chitralekha |2 Aug 2023 12:56 PM IST
సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జయసుధ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఇవాళ మధ్యాహ్నం కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఢిల్లీలోనే ఉన్నారు. గతంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన జయసుధ.. ఇప్పుడు ముషీరాబాద్ లేదా సికింద్రాబాద్ టికెట్ ఆశిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com