కాల్పుల ఘటనలో కొత్త కోణం

కాల్పుల ఘటనలో కొత్త కోణం

శామీర్‌పేట కాల్పుల ఘటనలో కొత్త కోణం వెలుగు చూసింది. ఫైరింగ్‌ జరిపిన మనోజ్‌, అతనితో సహజీవనం చేస్తోన్న స్మిత మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తామంటూ పలువురు అమ్మాయిలను ఈ జంట ట్రాప్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడలోని ఓ సంపన్న కుటుంబానికి చెందిన యువతికి మనోజ్‌, స్మిత జంట వల విసిరింది. ఆ కుటుంబం నుంచి 50 లక్షలు వసూలు చేసింది. స్మిత ఒరాకిల్‌ ఎంప్లాయిగా ఉంటూనే.. మనోజ్‌తో కలిసి మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. వీరి అక్రమాలపై పోలీసులు దృష్టిసారించారు.

Next Story