
By - jyotsna |24 March 2024 7:30 AM IST
రాజస్థాన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జైపూర్ జిల్లాలోని బస్సీ ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. ఆదివారం ఉదయం మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో కార్మికుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, 9 ఫైరింజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు.
కాగా, కెమికల్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధితులను ఆదుకుంటామని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com