Anvesh : అన్వేష్ మితిమీరిన తీరు.. ఇవేం మాటలు

Anvesh : అన్వేష్ మితిమీరిన తీరు.. ఇవేం మాటలు

నా అన్వేషన అన్వేష్ వ్యూస్ కోసం దిగజారిపోతున్నాడు. సోషల్ మీడియాలో ఏ టాపిక్ మీద చర్చ జరుగుతున్నా సరే మధ్యలోకి వచ్చి దరిద్రమైన వీడియోలు చేస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ల బట్టలు పద్ధతిగా ఉండాలి అని చెప్పే క్రమంలో రెండు పదాలు దొర్లాడు. దానికి ఆయన సారీ చెప్పాడు. మహిళా కమిషన్ ముందు హాజరయి అక్కడ కూడా సారీ చెప్పాడు. కానీ అనసూయ, చిన్మయి లాంటి వారు రెచ్చిపోయి వీడియోలు చేశారు. శివాజీని తిట్టారు. అయితే మధ్యలోకి నా అన్వేషన అన్వేష్ కూడా వచ్చి చేరాడు. ఎంత దారుణంగా మాట్లాడాడు అంటే.. శివాజీని బూతులు తిట్టాడు. చెప్పలేని విధంగా మాటలు అన్నాడు. గరికపాటి నర్సింహారావును పట్టుకుని చాలా నీచమైన కామెంట్ చేశాడు. కనీసం ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడాడు అన్వేష్. మీ ప్రైవేట్ పార్టులు కట్ చేసుకోండి అంటూ శివాజీని, గరికపాటిని అనడం అంటే.. అన్వేష్ అహంకారానికి ఇదే నిదర్శనం అంటున్నారు నెటిజన్లు.

ఆడవాళ్లు బట్టలు విప్పుకుని తిరిగినా సరే తప్పులేదు.. చూసేవాళ్లదే తప్పు అంటున్నాడు. పైగా పురాణాల్లో సీతాదేవి, ద్రౌపది ఏమైనా మాడ్రన్ బట్టలేసుకున్నారా. వాళ్లు చీరలు కట్టుకున్నాసరే వారిని ఎత్తుకెళ్లారు కదా అన్నాడు. ఇలా హిందూ దేవుళ్లను కూడా అవమానించాడు అన్వేష్. అన్వేష్ మీద సోషల్ మీడియా మొత్తం దుమ్మెత్తి పోస్తోంది. ఇంత ఘోరంగా మాట్లాడటంతో ఆయన్ను లక్షల మంది అన్ ఫాలో చేస్తున్నారు. యూట్యూబ్ లో కూడా లక్షల మంది అన్ సబ్ స్క్రైబ్ చేస్తున్నారు. అన్వేష్ ప్రవర్తన మితిమీరిపోయిందంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంత అహంకారపూరితంగా.. కనీస గౌరవం లేకుండా మాట్లాడటం అంటే అన్వేష్ కు ఎంత అహంకారం ఎక్కువైందో అర్థమైంది అంటున్నారు నెటిజన్లు.

హిందూ దేవుళ్లను, పండితులను, సంప్రదాయాలను అవమానిస్తూ వీడియోలు చేసిన అన్వేష్ ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఇప్పటికే హిందూ సంఘాలు, వీహెచ్ పీ లాంటివి కంప్లయింట్స్ కూడా చేశాయి. మరి పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి.


Next Story