
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్)లో చిక్కుకుపోయిన ఇద్దరు వ్యోమగాములు సునీతా విలియమ్స్, బారీ విల్‌మోర్‌లు.. ఎట్టకేలకు తిరిగి రాబోతున్నారు. వారిని తీసుకొచ్చేందుకు స్పేస్-ఎక్స్ ప్రత్యేక మిషన్ చేపట్టింది. శనివారం ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి క్రూ-9 స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపింది.
ఈ లాంచ్‌ప్యాడ్ నుంచి చేపట్టిన తొలి మానవ సహిత స్పేస్‌ఫ్లైట్ ఇదే. బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా సునీతా విలియమ్స్, విల్‌మోర్ ఐఎస్‌ఎస్‌కి చేరుకోగా, తిరుగు ప్రయాణంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఇద్దరు వ్యోమగాములు గత 100 రోజులుగా అక్కడే చిక్కుకుపోయారు. నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రాంలో భాగంగా స్పేస్-ఎక్స్ క్రూ-9 స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపుతున్నది. ఫిబ్రవరి 2025లో స్పేస్‌క్రాఫ్ట్ తిరుగు ప్రయాణంతో ఇద్దరు వ్యోమగాముల్ని భూమి మీదకు తీసుకొస్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com