
కోయంబత్తూరులో అత్యాధునిక క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. సోషల్ మీడియా వేదిక `ఎక్స్ (మాజీ ట్విట్టర్)` వేదికగా రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీఆర్బీ రాజా ఈ విషయమై సీఎం స్టాలిన్‌కు విజ్ఞప్తి చేశారు. క్రీడలు, క్రికెట్ ఔత్సాహికుడిగా డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో మరో హామీ జత పరుస్తున్నట్లు స్టాలిన్ తెలిపారు. కోయంబత్తూరులో అత్యాధునిక స్టేడియం ఏర్పాటు కృషి చేస్తామన్నారు.
మంత్రి రాజా పేర్కొన్నట్లుగా.. ఈ స్టేడియాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్మించేందుకు కృషిచేస్తామన్నారు. తమ ప్రభుత్వం, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ రాష్ట్రంలో ప్రతిభను ప్రోత్సహించేందుకు, క్రీడారంగంలో మౌలికవసతుల్ని మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నారని సీఎం తెలిపారు. ఇప్పటికే చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియం ఉండగా.. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కోయంబత్తూరులో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టేందుకు కృషిచేస్తామని సీఎం హామీ ఇవ్వడం గమనార్హం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com