చిత్తు కాగితాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

చిత్తు కాగితాల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

మధ్యప్రదేశ్‌లోని మైహర్‌ జిల్లాలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ ప్రత్యేక భోజనాన్ని కంచాలకు బదులుగా పేపర్లలో వడ్డించారు. భతిగ్వాన్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోమవారం చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారాయి. వీడియోలో విద్యార్థులు నేలపై కూర్చుని పాత పుస్తకాల నుంచి తీసిన పేపర్లలో తమకు వడ్డించిన హల్వా-పూరీని తింటున్నారు. దీనిపై కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసినట్లు సత్నా, మైహర్‌ జిల్లాల ప్రజా సంబంధాల అధికారి రాజేశ్‌ సింగ్‌ తెలిపారు.

Next Story