BABU: డల్లాస్‌లో కదం తొక్కిన తెలుగు ప్రజలు

BABU: డల్లాస్‌లో కదం తొక్కిన తెలుగు ప్రజలు

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత అరెస్ట్‌కు నిరసనగా ఖండాతరాల్లోనూ నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియాలో ఐటీ ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించగా... తాజాగా డల్లాస్‌లో తెలుగు ప్రజలు ఆందోళనలతో కదం తొక్కారు. దార్శనికుడు చంద్రబాబంటూ డల్లాస్‌లోని తెలుగు ప్రజలు నినదించారు. ఐయామ్‌ విత్‌ బాబు అంటూ ప్లకార్డులు ప్రదర్శరించారు.


చంద్రబాబుకు మద్దతుగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. న్యాయం కావాలి - చంద్రబాబు విడుదల కావాలనే నినాదాలతో డల్లాస్ వీధుల్లో నల్ల దుస్తులు ధరించి నిరసనలో పాల్గొన్నారు. తెలుగు ప్రజలు భారీగా ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. బాబు అరెస్టు అక్రమమన్న నినాదాలతో పరిసర ప్రాంతాలను హోరెత్తించారు. వాషింగ్టన్ లోనూ తెలుగు ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా ఆందోళన చేశారు. బాబును వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.Next Story