
టీడీపీ అధినేత చంద్రబాబుకు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సుప్రీంకోర్టు స్వల్ప ఊరటను కల్పించింది. ఈ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను విచారించిన జస్టిస్ బేలా ఎం. త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఎన్నికల వ్యవహారాల్లో ఫుల్ బిజీగా ఉన్న చంద్రబాబుకు... విచారణ వాయిదా పడటం బిగ్ రిలీఫ్ గానే చెప్పుకోవచ్చు.
స్కిల్ కేసులో గత ఏడాది సెప్టెంబర్ లో చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చంద్రబాబుకు విజయవాడలోని ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ క్రమంలో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే సమయంలో ఆయన బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఇరువైపు వాదనలు విన్న హైకోర్టు... చంద్రబాబుకు తొలుత తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్ గా మార్చింది. దీంతో, చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com